ETV Bharat / state

పోడుభూముల సమస్య పరిష్కార విధానంపై సీఎస్​ సమీక్ష

పోడు భూముల సమస్య పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణ విధానంపై అధికారులతో సీఎస్​ సోమేశ్​ కుమార్​ అధికారులతో చర్చించారు. రెవెన్యూ, అటవీశాఖల అధికారులతో బీఆర్కేభవన్​లో సమీక్ష నిర్వహించారు.

cs somesh kumar
cs somesh kumar
author img

By

Published : Oct 27, 2021, 10:45 PM IST

పోడు భూముల సమస్య పరిష్కారం కోసం దరఖాస్తులు స్వీకరించే ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతరులతో అటవీ పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, అటవీశాఖల అధికారులతో బీఆర్కేభవన్​లో సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ విధానంపై చర్చించారు. అటవీ పరిరక్షణ కమిటీలచే ఆయా గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ, అందులో పొందు పరిచే అంశాలు ఇతర అంశాలపై చైతన్య, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సోమేశ్ కుమార్ తెలిపారు. భవిష్యత్​లో అటవీ భూములను ఆక్రమించబోమని గ్రామస్థులు అంగీకరించేలా చైతన్య కలిగించాలని సూచించారు.

అదే తరహాలో డివిజన్, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. పోడు భూముల సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేకాధికారులను నియమించాలని సీఎస్ సూచించారు. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అటవీశాఖ తరఫున సీనియర్ అధికారులను నియమించాలని తెలిపారు. మొత్తం ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ఏ మాత్రం వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Huzurabad election: 'నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.