ఉపాధి కోసం రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లిన బాధితుల సమస్యలపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకించి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎదుర్కొంటున్న వారి ఇబ్బందులను గుర్తించి పరిష్కారానికి సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖ అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ఇచ్చే సలహాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు వివరించి ఓ విధానం రూపొందించవచ్చని అన్నారు.
విదేశాల్లో ఉంటున్న రాష్ట్ర వాసుల సంక్షేమానికి సీఎం పూర్తి చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. విదేశాల్లో ఉంటున్న కేరళ వాసుల కోసం ఆ రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి అధ్యయనం చేసినట్లు సీఎస్ వెల్లడించారు.
ఇదీ చదవండి: జోరందుకున్న 'మండలి' సన్నాహక సమావేశాలు