ETV Bharat / state

'ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి' - మిడతల దండుపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష

ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో మిడతల ప్రభావానికి అవకాశం ఉండే తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, పోలీసు, వ్యవసాయ, అటవీ అధికారులతో పాటు ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్​కుమార్ సమీక్షించారు.

Cs somesh kumar reivew on locust affected areas
'ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'
author img

By

Published : Jun 17, 2020, 4:53 PM IST

మిడతల దండుకు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా... ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్... అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో మిడతల ప్రభావానికి అవకాశం ఉండే తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, పోలీసు, వ్యవసాయ, అటవీ అధికారులతో పాటు ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. సరిహద్దు జిల్లాల్లో మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న ప్రభావిత గ్రామాల కోసం సూక్ష్మ స్థాయి ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసి సంబంధిత వ్యక్తులను భాగస్వాములుగా చేయాలని చెప్పారు. ప్రతి మండలానికో ప్రత్యేకాధికారిని నియమించి... జిల్లా స్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు సరిహద్దు జిల్లాలతో సమన్వయంతో పనిచేసి మిడతల దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సోమేశ్​కుమార్ తెలిపారు. మిడతల గమనం, నిరోధక చర్యలపై శాస్త్రవేత్తలు సమావేశంలో అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఇవీ చూడండి: విద్యుత్​ బిల్లులపై సీఎం కేసీఆర్​కు జీవన్​రెడ్డి లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.