ETV Bharat / state

సీఎం సహాయనిధికి వచ్చే డబ్బంతా ఇక సీఎస్​ఆర్​ నిధులే.. - సీఎం సహాయ నిధి డబ్బును సీఎస్​ఆర్​ ఫండ్స్​ కిందకి వస్తాయి

కొవిడ్-19 నివారణ చర్యల కోసం వివిధ కంపెనీలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చే విరాళాలను కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇచ్చే నిధులుగా పరిగణించే వెసులుబాటును కలిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ ఉత్తర్వులను జారీ చేశారు.

CS Somesh kumar Ordinance issued on converting CM Relief Fund into Corporate Social Responsibility Fund
సీఎం సహాయనిధికి వచ్చే డబ్బంతా ఇక సీఎస్​ఆర్​ నిధులే..
author img

By

Published : Apr 17, 2020, 7:42 PM IST

కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్ధతుగా పలువురు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు. అయితే పీఎం కేర్స్ నిధికి ఇచ్చే విరాళాలకు మాత్రమే కార్పొరేట్ ​సామాజిక బాధ్యత నిధులు (సీఎస్ఆర్) కింద అర్హత ఉండగా... ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటి వరకు ఆ వెసులుబాటు లేదు. ఇటీవల ప్రధానమంత్రి నిర్వహించిన దృశ్యామాధ్యమ సమీక్షలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధానికి రాసిన లేఖలోనూ పేర్కొన్నారు.

మార్చి 24వ తేదీ నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన విరాళాలన్నింటినీ కొవిడ్-19 నివారణ చర్యలు, సంబంధిత అవసరాలకు ఉపయోగించుకునేలా రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి జమ చేయనున్నట్టు తాజా ఆదేశాలు పేర్కొన్నాయి. దీనితో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చే విరాళాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇచ్చే నిధులుగా పరిగణించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ ఉన్నా జల్లికట్టు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.