ETV Bharat / state

'రానున్న రోజుల్లో ఎండ మరింత తీవ్రం... అప్రమత్తత అవసరం' - High temparatues in telangana

CS Somesh Kumar On Heatwave: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రానున్న రోజుల్లో ఎండ మరింత తీవ్రంకానున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సోమేశ్​కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

Somesh
Somesh
author img

By

Published : Mar 30, 2022, 8:42 PM IST

CS Somesh Kumar On Heatwave: రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. తీవ్రఎండల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీ రాజ్, విద్యా శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ మాణిక్ రాజ్, భారత వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు.

ఎండతీవ్రత అధికం: రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

ప్రాణనష్టం జరగొద్దు: సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సీఎస్ అన్నారు. ఎండ తీవ్రత వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పరచాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాఠశాలల సమయాన్ని మరింతగా తగ్గించాలని అన్నారు. ఉపాధిహామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని అన్నారు.

ఇదీ చూడండి: మాడు పగిలిపోయేలా నిప్పులు కురిపిస్తున్న సూరీడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.