ETV Bharat / state

'హైదరాబాద్​ను మెగా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలు పంపండి' - CS Somesh Kumar Latest News

బీఆర్కే భవన్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ అధ్యక్షతన హెచ్ఎంఆర్ఎల్, హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటేడ్ బోర్డు సమావేశం నిర్వహించారు. నగరంలో మెట్రో రైల్ రెండో దశ, ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్లపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

CS Somesh Kumar orders Hyderabad authorities
హైదరాబాద్​ అధికారులకు సీఎస్​ సోమేశ్​కుమార్ ఆదేశం
author img

By

Published : Nov 2, 2020, 10:12 PM IST

హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ రెండో దశ, ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్లపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ ఆదేశించారు.

హెచ్ఎంఆర్ఎల్, పురపాలక, ఆర్అండ్ బీ, ఆర్థిక శాఖ, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నత స్థాయి అధికారుల బృందం ఔటర్ రింగ్ రోడ్డు, మూసి రివర్ ప్రాజెక్టుతో పాటు ఇతర ముఖ్యమైన ట్రాఫిక్ కారిడార్​ను సంయుక్తంగా సందర్శించాలని సూచించారు. దీనిపై నగరంలో సమగ్ర ట్రాఫిక్, ట్రాన్స్ పోర్టేషన్ ప్రణాళికను ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని మెగా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. బీఆర్కే భవన్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ అధ్యక్షతన హెచ్ఎంఆర్ఎల్, హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటేడ్ బోర్డు సమావేశం నిర్వహించారు.

మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులు, 18 కిమీ ఎలివేటేడ్ బస్ రాపిడ్ ట్రాన్స్ పోర్టు సిస్టం ప్రాజెక్ట్​పై చర్చించారు. ఈ సందర్భంగా మెట్రో రైలు ఆపరేషన్స్ రెండో దశ ఎలివేటేడ్ బస్ రాపిడ్ ట్రాన్స్ పోర్టు సిస్టం ప్రాజెక్ట్​పై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐదేళ్ల వరకు మెట్రో రైల్ ఆపరేషన్స్ పర్యవేక్షించేందుకు ఎయికామ్ ప్రైవేటు లిమిటేడ్ సంస్థకు రూ.6.94 కోట్ల ఇచ్చేందుకు సమావేశం ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండి: మిస్సింగ్​.. వీళ్లంతా ఏమైపోతున్నారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.