ETV Bharat / state

రూ.22,936 కోట్ల పంట రుణాల పంపిణీ - ఎస్​ఎల్​బీసీ సమావేశం

రాష్ట్రంలో వానా కాలం పంట రుణాల కింద సెప్టెంబరు 30 వరకూ రూ.22,936 కోట్లు అందించినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) ప్రకటించింది. లక్ష్యంలో 71.82శాతం పూర్తయినట్లు తెలిపింది. మొత్తం ఆర్థిక సంవత్సరం పంట రుణాల లక్ష్యంలో 43శాతం పూర్తయినట్లు వెల్లడించింది.

cs-somesh-kumar-attend-state-level-bankers-committee-meeting-on-video-conference
రూ.22,936 కోట్ల పంట రుణాల పంపిణీ
author img

By

Published : Dec 22, 2020, 8:37 AM IST

వానాకాలం పంట రుణాల కింద సెప్టెంబర్​ 30 వరకు రూ.22,936 కోట్లు అందించినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రకటించింది. వ్యవసాయ పెట్టుబడి రుణాల కింద మరో రూ.10,791 కోట్లు ఇచ్చినట్లు వివరించింది. రాష్ట్ర బ్యాంకర్ల సమితి సమావేశాన్ని సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎస్‌ఎల్‌బీసీ ఛైర్మన్‌, ఎస్‌బీఐ సీజీఎం ఓ.పి.మిశ్రా, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, కేంద్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారు లలిత్‌కుమార్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఆర్‌బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ కె.నిఖిల, ప్రభుత్వ, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు 30వరకూ వ్యవసాయ రుణాల పంపిణీ పురోగతిని సమీక్షించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా లక్ష్యం మేరకు పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు అందించారని బ్యాంకర్లను అభినందించారు.
* రాష్ట్రంలో కోటీ 83 లక్షల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.2,631 కోట్ల డిపాజిట్‌లు ఉన్నట్లు ఎస్‌ఎల్‌బీసీ వెల్లడించింది.
* ఆత్మనిర్భర్‌ భారత్‌ నిధి కింద వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున 2.07 లక్షల మందికి రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు నవంబరు వరకు రూ.5,437 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపింది.
* కొవిడ్‌ అత్యవసర మద్దతు కింద రైతులకు రూ.231 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.370 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: కొలువుల జాతర.. ఖాళీలు 65వేలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.