ETV Bharat / state

రైల్వే, ఆర్టీసీ అధికారులకు థాంక్స్​ చెప్పిన సీఎస్​, డీజీపీ

ఒకే రోజు రికార్డు స్థాయిలో 40 రైళ్ల ద్వారా సుమారు 50 వేల మంది వలస కార్మికులను తరలించే ప్రక్రియను.. పూర్తిచేసినందుకు రైల్వే, ఆర్టీసీ అధికారులకు సీఎస్​ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

CS somesh and DGP thanks to Railway and RTC officials in telangana
రైల్వే, ఆర్టీసీ అధికారులకు థాంక్స్​ చెప్పిన సీఎస్​, డీజీపీ
author img

By

Published : May 24, 2020, 11:32 PM IST

తెలంగాణ నుంచి ఒకే రోజు రికార్డు స్థాయిలో 40 రైళ్ల ద్వారా దాదాపు 50 వేల వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు తరలించారు. ఆ ప్రక్రియను సాఫీగా పూర్తిచేసినందుకు రైల్వే అధికారులకు సీఎస్​ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం నుంచి శనివారం వివిధ రైల్వే స్టేషన్ల నుంచి వలస కార్మికులను వివిధ రాష్ట్రాలకు తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 124 రైళ్ల ద్వారా 1.58 లక్షల మంది వలస కార్మికులను వారి వారి రాష్ట్రాలకు తరలించామని చెప్పారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13.15 కోట్లను ఖర్చు చేసిందని వివరించారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు

రాష్ట్రంలో పశ్చిమ బంగాల్ మినహా వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల తరలింపు దాదాపు పూర్తి అయిందని సోమేశ్ కుమార్ అన్నారు. వెస్ట్ బెంగాల్లో అక్కడి పరిస్థితులు చక్కబడ్డాక ఆ రాష్ట్రం వలస కార్మికులను ఒకటి రెండు రోజుల్లోనే పంపడానికి 10 రైళ్లను సిద్ధంగా ఉంచామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఇంకా మిగిలి ఉంటే వారిని కూడా పంపడానికి ఒకటి లేదా రెండు రైళ్ల ద్వారా పంపేందుకై చర్యలను చేపట్టామని అన్నారు.

ఒక్కో కార్మికునికి..

వలస కార్మికులను ఇంటి వద్ద నుంచి బస్సులను ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్లకు తరలించి, ఒక్కో కార్మికునికి రెండు ఆహార ప్యాకెట్లు, మూడు లీటర్ల మంచినీరు, పండ్లను ప్రభుత్వ ఖర్చుతో అందించామని సీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చుతోనే వలస కార్మికులను తరలించిందని అన్నారు. వలస కార్మికులను సాఫీగా తరలించేందుకై కృషి చేసిన రవాణా శాఖ ముఖ్య కారదర్శి సునీల్ శర్మ, నోడల్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, అడిషనల్ డీజీ జితేందర్, పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్, కలెక్టర్లు, అనితా రామచంద్రన్, శ్వేతా మహంతి, అమయ్ కుమార్, వెంకటేశ్వర్లు, హనుమంత రావులకు, రైల్వే శాఖకు సీఎస్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి : గొర్రెకుంట బావి మృతదేహాల ఘటనలో వీడిన మిస్టరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.