దేశంలోని ప్రతి ఒక్కరూ సమాజసేవలో ముందుండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ జోషి కోరారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని భారత సేవాశ్రమ సంఘంలో నిర్వహించిన కాళీపూజలో పాల్గొన్నారు. ఈ వేడుకకు ఎస్కే జోషితో పాటు ఏపీ హైకోర్టు జడ్జీ జస్టిస్ రాంచంద్రరావు, శ్రీ చక్ర సిమెంట్స్ డీజీఎమ్ సర్వేశ్వర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండిః నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు...?