ETV Bharat / state

మన రికార్డు మనమే బద్దలు కొట్టాలి: సీఎస్ శాంతికుమారి

CS Shanti Kumari Review on Kanti Velugu : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంపై సీఎస్ శాంతికుమారి సమీక్ష చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు రెండో దఫా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని సీఎస్ తెలిపారు. కంటి వెలుగుపై ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి తెలిసేలా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలన్న సీఎస్.. అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలు అందించాలని ఆదేశించారు.

CS Shanti Kumari
CS Shanti Kumari
author img

By

Published : Jan 13, 2023, 10:14 PM IST

CS Shanti Kumari Review on Kanti Velugu : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు రెండో దఫా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని సీఎస్ చెప్పారు. 2018లో నిర్వహించిన తొలి విడత కంటే ఎక్కువ మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా మన రికార్డు మనమే బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాలని సీఎస్ శాంతికుమారి పిలుపునిచ్చారు.

ఇప్పటికే 15 లక్షలకు పైగా కళ్లద్దాలను రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలు, అర్బన్ వైద్య కేంద్రాలకు పంపిణీ చేసినట్లు సీఎస్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. కంటి వెలుగుపై ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి తెలిసేలా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలన్న సీఎస్... అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలు అందించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.

100 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు: మొదటి దఫా కంటి వెలుగు విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో ప్రభుత్వం రెండో విడత కార్యక్రమానికి సిద్ధమవుతోంది. మొదటి విడతలో కోటీ 54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. ఈసారి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులు కేంద్రంగా కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అవసరమున్న ప్రతి వ్యక్తికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం వైద్యుల సూచనతో మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇస్తారు. జిల్లాల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రభావవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలల పాటు జరిగింది. అయితే రెండో విడత మాత్రం 100 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

క్యాంపుల తేదీలు అందరికీ తెలిసేలా ఏర్పాట్లు : పథకంలో భాగంగా 30 లక్షల రీడింగ్ గ్లాసులు, 25 లక్షల ప్రిస్క్రిప్షన్ గ్లాసులు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం అవసరమైన కళ్లద్దాలను జిల్లాలకు చేరవేస్తున్నారు. కంటి పరీక్షలు చేసిన నెల రోజుల్లోపు ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. రోజువారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత‌్తలు తీసుకుంటున్నారు. ఇటీవలే ప్రభుత్వం 929 మంది వైద్యులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా నియమించింది. వీరందరికీ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. మంత్రుల నేతృత్వంలో మున్సిపాలిటీలు, మండల పరిషత్తుల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్యాంపుల నిర్వహణ తేదీలు అందరికీ తెలిసేలా రేషన్ షాపులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.