ETV Bharat / state

'సాయంగా భావించండి.. కుదుటపడ్డాక పూర్తి జీతం ఇస్తాం' - పెన్షనర్ల

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యానే వేతనాల సొమ్ము కొంత రిజర్వులో పెట్టామని సీఎస్​ సోమేశ్​కుమార్​ వెల్లడించారు. పరిస్థితి అంతా కుదుటపడిన తర్వాత జీతాలను తిరిగి చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో ఆర్థిక నిల్వలు ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది ఉద్యోగులు అందించే సహకారంగా భావించాలని ఉద్యోగ సంఘాల ఐకాస నేతలకు సీఎస్‌ విజ్ఞప్తి చెప్పారు.

cs meeting to the tngo employees at Hyderabad for the salaries of the government employees
'సాయంగా భావించండి.. కుదుటపడ్డాక పూర్తి జీతం ఇస్తాం'
author img

By

Published : Apr 1, 2020, 7:10 AM IST

కరోనా నేపథ్యంలో రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతభత్యాలలో కొంత సొమ్ము రిజర్వులో పెట్టామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చెప్పారు. అత్యవసర సమయంలో ఆర్థిక నిల్వలు ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనిని ప్రభుత్వానికి ఉద్యోగులు అందిస్తున్న సహకారంగా భావించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడిన తర్వాత ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో ఆయనను తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐకాస అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, మమత ఇతర నేతలు పద్మాచారి, సత్యనారాయణ తదితరులు కలిశారు. వేతనాల్లో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 27ని పెండింగులో పెట్టాలని, ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలివ్వాలని, పెన్షనర్లకు కోతలు విధించవద్దని, మార్చి నెలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలని కోరారు. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ వేతనాలపై ఉద్యోగులు ఆందోళన చెందవద్దన్నారు. కోత తాత్కాలికమే అన్నారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. పరిస్థితి దృష్ట్యా అత్యవసర సేవలలో ఉన్న వారి జీతాలను కూడా కొంత డిపాజిట్‌ చేస్తున్నాం. ప్రజల ఇబ్బందులు తొలగించడమే ప్రభుత్వానికి ప్రాధాన్యం. వారికి సాయం చేయడంలో ఉద్యోగులు భాగస్వాములే. లాక్‌డౌన్‌ పూర్తి కాగానే ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఐకాస విన్నవించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు టీఎన్జీవోభవన్‌లో ఐకాస నేతలు సమావేశమై జీవో నం.27 పరిణామాలపై చర్చించారు.

వేతన కోత అప్రజాస్వామికం

లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు వేతనాలు తగ్గించరాదని కేంద్ర ప్రభుత్వం చెప్పినా అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రభుత్వరంగ, ఒప్పంద ఉద్యోగుల ఐక్యవేదిక పేర్కొంది. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ఇచ్చే వేతనమే నామమాత్రమని, అందులో కోత విధించడం భావ్యం కాదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. కరోనా నివారణకు శ్రమిస్తున్న పనిచేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల జీతాల్లో కోత విధించొద్దని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఐకాస కోరింది.

కోత వద్దు: కాంగ్రెస్‌

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా వైద్యశాఖ, చిరు ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి కోత విధించకుండా అందించాలని కాంగ్రెస్‌ కోరింది. ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ముఖ్యమంత్రికి మంగళవారం వేర్వేరుగా లేఖలు రాశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫార్మాసిటీ భూసేకరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.11,710 కోట్ల విలువగల పనులకు టెండర్లు పిలిచారని, ఈ సమయంలో ఇది సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: సీఎంకు పార్టీల నాయకుల లేఖ

ఉద్యోగులకు సగం జీతమే ఇవ్వాలనే నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు కోదండరాం, తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు.

ఇదీ చదవండి: 'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.