ETV Bharat / state

దిశ కేసులో కీలక ఆధారాలు.. సూపర్​ లైట్​తో గుర్తింపు - disha murder case

దిశ హత్య కేసు దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులు కీలక ఆధారాల్ని సేకరించారు. ఇందుకోసం నిపుణులతో కూడిన క్లూస్ బృందాన్ని రంగంలోకి దించారు. కేసును న్యాయస్థానంలో నిరూపించేందుకు అవసరమైన కీలక ఆధారాల్ని మలివిడతలో క్లూస్ టీం నిపుణులు సేకరించారు. అతిసూక్ష్మ వస్తువుల్ని కూడా గుర్తించగలిగే  సూపర్​​ లైట్ పరికరాన్ని వినియోగించి ఆధారాల్ని సేకరించారు.

సూపర్​ లైట్​తో గుర్తింపు
దిశ కేసులో కీలక ఆధారాలు..
author img

By

Published : Dec 6, 2019, 6:04 AM IST

Updated : Dec 6, 2019, 11:20 AM IST

దిశ కేసులో కీలక ఆధారాలు.. సూపర్​ లైట్​తో గుర్తింపు

దిశ హత్యకేసులో పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించారు. శంషాబాద్ టోల్‌ప్లాజా నుంచి దిశను కొత్తూరు జేపీ దర్గా వద్దకు తీసుకెళ్లిన దుండగులు అక్కడ మరోసారి అకృత్యానికి పాల్పడ్డారు. అనంతరం చటాన్​పల్లికి తీసుకెళ్లి కాల్చి చంపేశారు. ఆ సమయంలో లారీలో ఆధారాలు దొరక్కుండా నిందితులు కొంతమేర శుభ్రం చేసినా.. ఇప్పటికే పోలీసులు వెంట్రుకలు సేకరించారు. తాజాగా సూపర్‌ లైట్ వినియోగించడం వల్ల లారీ క్యాబిన్లో రక్తపుమరకల్ని గుర్తించగలిగారు. క్యాబిన్లో డ్రైవర్ వైపు కాకుండా ఆ రెండోవైపు తలుపుపై ఈ మరకల్ని సేకరించారు. ఇవి దిశ రక్తపు మరకలేనా కాదా..? అనేది తేల్చగలిగితే ఈ కేసుకు బలమైన ఆధారంగా మారనుంది. ఆ మరకల్ని ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపి విశ్లేషించనున్నారు. లారీ వెనక ట్రాలీలో ఇటుకలోడు ఉన్నందున దిశను నిందితులు క్యాబిన్లోకి తరలించినట్లు తెలుస్తోంది.

ఏసీపీల నేతృత్వంలో బృందాలు:

ఏసీపీల నేతృత్వంలో బృందాలు కేసును ఫాస్ట్ ట్రాక్​లో విచారించనున్న నేపథ్యంలో త్వరితగతిన కీలక ఆధారాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఏసీపీల నేతృత్వంలో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. కేసులో సాక్ష్యాల సేకరణ, వాంగ్మూలాల సేకరణ, సీసీ కెమేరాల పుటేజీల పరిశీలన, నిందితుల ఫోన్ కాల్ డేటా విశ్లేషణ తదితర అంశాల్ని విభజించి బృందాలకు బాధ్యతలు అప్పగించారు.

ఘటనకు రెండ్రోజుల ముందు..

దిశ పై అకృత్యానికి పాల్పడిన నిందితులు ఆ ఒకట్రెండు రోజుల వ్యవధిలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్ నుంచి రాజేంద్రనగర్ సిక్ ఛావునీ వరకు ప్రయాణించినట్లు తెలుస్తోంది. గత నెల 21న కీలక నిందితుడు మహ్మద్ అలీ క్లీనర్‌తో కలిసి ఇనుపరాడ్ల లోడుతో కర్ణాటకలోని రాయ్ చూర్ వెళ్లాడు. అక్కడ లోడ్ దించిన అనంతరం అదే నెల 24న గంగావతి వెళ్లి ఇటుకల లోడ్ తో హైదరాబాద్​ తిరిగి వచ్చాడు. మార్గమధ్యలో మహబూబ్ నగర్ వద్ద ఆర్టీఏ లారీని తనిఖీ చేశారు. అక్కడి నుంచి తప్పించుకొచ్చిన నిందితులు రాయికల్ టోల్ ప్లాజా వద్ద స్టీల్ రాడ్లను తుక్కు దుకాణంలో విక్రయించారు. 26న రాత్రి తొమ్మిది గంటల సమయంలో శంషాబాద్ టోల్ ప్లాజా వద్దకు వచ్చి అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడికి సమీపంలోని తొండుపల్లి ప్లాజా వద్దే గడిపారు. అదే రాత్రి దిశ పై అత్యాచారానికి ఒడిగట్టారు.

వాంగ్మూలాల సేకరణ..

దిశను లారీ క్యాబిన్​లో తరలించేటప్పుడు రెండు పెట్రోల్ బంకులకు వెళ్లారు. మృతదేహాన్ని కాల్చేసిన అనంతరం తెల్లవారుజామున 4 గంటల వరకు రాజేంద్రనగర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితులు ఆగిన ప్రతీచోట సీసీ ఫుటేజీలను సేకరించడంపై దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. ఆ ప్రాంతాల్లో ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలాల్నీ పోలీసులు సేకరిస్తున్నారు. మహబూబ్ నగర్ ఆర్టీఏకు నోటీస్ ఇచ్చి ఆయన్నీ విచారించనున్నారు. ఈ ఆధారాలన్నీ పకడ్బందీగా సేకరించిన తర్వాతే వాటిని విశ్లేషించుకొని నిందితుల్ని కస్టడీకి తీసుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుల్ని కస్టడీకి తీసుకొచ్చి రహస్యంగా ఘటనాస్థలాలకు తరలించారని.. ఆ ఘటనల్ని పునఃసృస్టించారని పెద్దఎత్తున ప్రచారం జరిగినా సైబరాబాద్ ఉన్నతాధికారులు మాత్రం వాటిని ఖండించారు.

ఇవీ చూడండి: దిశ నిందితులను వెంటనే శిక్షించాలి : మా అసోసియేషన్‌

TG_HYD_06_06_DISHA_UPDATE_PKG_3182388 reporter : sripathi.srinivas Note : ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) దిశ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సైబరాబాద్ పోలీసులు కీలక ఆధారాల్ని సేకరించారు. ఇందుకోసం నిపుణులతో కూడిన క్లూస్ బృందాన్ని రంగంలోకి దించారు. నిందితులను అరెస్ట్ చేసిన సమయంలోనే పలు ఆధారాల్ని సేకరించినా. కేసును న్యాయస్థానంలో నిరూపించేందుకు అవసరమైన కీలక ఆధారాల్ని మలివిడతలో క్లూస్ టీం నిపుణులు సేకరించారు. ఈక్రమంలో శంషాబాద్ తొండుపల్లి , షాద్ నగర్,చటాన్ పల్లి పటనాస్థలాల్లో శుక్రవారం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. షాద్ నగర్ డిపోలో ఉన్న లారీని మరోసారి పరిశీలించారు. అతిసూక్ష్మ వస్తువుల్ని సైతం గుర్తించగలిగే స్పూ లైట్ పరికరాన్ని వినియోగించి ఆధారాల్ని సేకరించారు. LooK... వాయిస్: దిశ హత్యకేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించారు. శంషాబాద్ టోల్‌ప్లాజా నుంచి దిశను కొత్తూరు జేపీ దర్గా వద్దకు తీసుకెళ్లిన దుండగులు అక్కడ మరోసారి అకృత్యానికి పాల్పడ్డారు. అనంతరం చటానపల్లికి తీసుకెళ్లి కాల్చి చంపేశారు . ఆ సమయంలో లారీలో ఆధారాలు దొరక్కుండా నిందితులు కొంతమేర శుభ్రం చేసినా..ఇప్పటికే పోలీసులు వెంట్రుకలు సేకరించారు. తాజాగా సూపర్‌ లైట్ వినియోగించడంతో పోలీసులు లారీ క్యాబిన్లో రక్తపుమరకల్ని గుర్తించగలిగారు. క్యాబిన్లో డ్రైవర్ వైపు కాకుండా ఆ రెండోవైపు తలుపుపై ఈ మరకల్ని సేకరించారు. ఇవి దిశ రక్తపు మరకలేనా కాదా..? అనేది తేల్చగలిగితే ఈ అంశం కేసుకు బలమైన ఆధారంగా మారనుంది. ఆ మరకల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి విశ్లేషించనున్నారు. ఈ పరిణామాల్ని పరిశీలిస్తే దిశ పై మృగాళ్ల అకృత్యానికి లారీ క్యాబిన్ మూగసాక్షిగా నిలిచినట్లుగా కనిపిస్తోంది. లారీ వెనక ట్రాలీలో ఇటుకలోడు ఉండటంతో దిశను నిందితులు క్యాబిన్లోకి తరలించినట్లు తెలుస్తోంది. ఏసీపీల నేతృత్వంలో బృందాలు కేసును ఫాస్ట్ ట్రాక్ లో విచారించనున్న నేపథ్యంలో త్వరితగతిన కీలక ఆధారాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఏసీపీల నేతృత్వంలో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. కేసులో సాక్ష్యాల సేకరణ, వాంగ్మూలాల సేకరణ, సీసీ కెమేరాల పుటేజీల విశ్లేషణ, నిందితుల ఫోన్ కాల్ డేటా విశ్లేషణ తదితర అంశాల్ని విభజించి బృందాలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఆధారాల్ని సేకరించి పోలీసులు అభియోగపత్రం పకడ్బందీగా రూపొందించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కేసులో నిందితులు ప్రయాణించిన మార్గాల్లో సీసీ ఫుటేజీలను బలమైన ఆధారాలుగా మలచడంపై పోలీసులు దృష్టి సారించారు. దిశ పై అకృత్యానికి పాల్పడిన నిందితులు ఆ ఒకట్రెండు రోజుల వ్యవధిలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్ నుంచి రాజేంద్రనగర్ సిక్ ఛావునీ వరకు ప్రయాణించినట్లు తెలుస్తోంది. గత నెల 21న కీలక నిందితుడు మహ్మద్ అలీ క్లీనర్‌తో కలిసి ఇనుపరాడ్ల లోడుతో కర్ణాటకలోని రాయ్ చూర్ వెళ్లాడు. అక్కడ లోడ్ దించిన అనంతరం అదే నెల 24న గంగావతి వెళ్లి ఇటుకల లోడ్ తో హైదరాబాదు తిరిగి వచ్చాడు. మార్గమధ్యలో మహబూబ్ నగర్ వద్ద ఆర్టీఏ లారీని తనిఖీ చేశారు. అక్కడి నుంచి తప్పించుకొచ్చిన నిందితులు రాయికల్ టోల్ ప్లాజా వద్ద స్టీల్ రాడ్లను తుక్కు దుకాణంలో విక్రయించారు. 26న రాత్రి తొమ్మిది గంటల సమంలో శంషాబాద్ టోల్ ప్లాజా వద్దకు వచ్చి అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడికి సమీపంలోని తొండుపల్లి ప్లాజా వద్దే గడిపారు. అదే రాత్రి దిశ పై అత్యాచారానికి ఒడిగట్టారు. దిశను లారీ క్యాబిన్ లో తరలించేటప్పుడు రెండు పెట్రోల్ బంకులకు వెళ్లారు. మృతదేహాన్ని కాల్చేసిన అనంతరం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు రాజేంద్రనగర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితులు ఆగిన ప్రతీచోట సీసీ ఫుటేజీలను సేకరించడం పై దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలాల్నీ పోలీసులు సేకరిస్తున్నారు. మహబూబ్ నగర్ ఆర్టీఏకు నోటీస్ ఇచ్చి ఆయన్నీ విచారించనున్నారు. ఈ ఆధారాలన్నీ పకడ్బందీగా సేకరించిన తర్వాతే వాటిని విశ్లేషించుకొని నిందితుల్ని కస్టడీకి తీసుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుల్ని కస్టడీకి తీసుకొచ్చి రహస్యంగా ఘటనాస్థలాలకు తరలించారని.. ఆయా ఘటనల్ని పునఃసృస్టించారని పెద్దఎత్తున ప్రచారం జరిగినా సైబరాబాద్ ఉన్నతాధికారులు మాత్రం వాటిని ఖండించారు.
Last Updated : Dec 6, 2019, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.