లాక్డౌన్లో ఇంటికే పరిమితం అయిన వారి ఆరోగ్య నిమిత్తం భారత ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ కార్యక్రమం గురువారం గ్రూప్ సెంటర్ సీఆర్పీఎఫ్ హైదరాబాద్ చాంద్రాయనగుట్టలో జరిగింది.
ప్రతి జవాన్ రోజూ ఉదయం 5 కిలోమీటర్లు, వారి కుటుంబ సభ్యులు 3 కిలో మీటర్ల పరుగు, నడక కొనసాగిస్తామని ప్రతినబూనారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఆర్పీఎఫ్ సౌత్‌జోన్ డీఐజీపీ ఎంఎస్ షెఖావత్ హాజరయ్యారు. కార్యక్రమంలో సౌత్ జోన్ డీఐజీపీ సిటీ వెంకటేష్ పాల్గొన్నారు. పరుగులో ప్రతిభ కనబర్చిన వారికి నిర్వాహకులు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఇదీ చూడండి: 'హైదరాబాద్‌లో ఇండో- సోమాలియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం'