ETV Bharat / state

ఘనంగా సీఆర్పీఎఫ్​ 81వ రైసింగ్​డే ఉత్సవాలు

author img

By

Published : Jul 28, 2019, 5:25 PM IST

నీరు పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గవర్నర్​ నరసింహన్​ అన్నారు. హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్డులోని పీపుల్స్​ ప్లాజాలో సీఆర్పీఎఫ్​ 81వ రైసింగ్​ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జవాన్లు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సీఆర్పీఎఫ్​ జవాన్లు
ఘనంగా సీఆర్పీఎఫ్​ 81వ రైసింగ్​డే ఉత్సవాలు

హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్డులోని పీపుల్స్​ ప్లాజాలో సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​ 81 వ రైసింగ్​ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్​ ఈఎస్​ఎల్​ నరసింహన్​ హాజరయ్యారు. సీఆర్పీఎఫ్​ జవాన్లు చేసిన కవాతును వీక్షించి... గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సేవ్​ వాటర్​... సేవ్​ ఎర్త్​ పేరిట నిర్వహించిన 5 కె పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్​ జవాన్లు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

నీటి పొదుపులో భాగస్వాములు కావాలి

ఉత్సవాలు జరుపుకుంటున్న సీఆర్పీఎఫ్​ జవాన్లకు గవర్నర్​ నరసింహన్​ శుభాకాంక్షలు తెలిపారు. నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పరుగు నిర్వహించడాన్ని ఆయన అభినందించారు. నీరు లేనిదే మనుగడ సాధించలేమని అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి : లాల్​దర్వాజలో బోనాలు సమర్పించిన మంత్రులు

Intro:Body:

adf

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.