ETV Bharat / state

వడగండ్ల వాన బీభత్సం.. పెద్దఎత్తున దెబ్బతిన్న పంటలు

author img

By

Published : Mar 17, 2023, 9:41 PM IST

రాష్ట్రవ్యాప్తంగా వడగండ్ల వాన సృష్టించిన బీభత్సం.. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చాలా ప్రాంతాల్లో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. చేతికందొచ్చిన పంట మార్కెట్‌ యార్డుల్లో తడిసి ముద్దయింది. పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు, అధికారులు.. నష్టాన్ని అంచనా వేసి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Telangana
Telangana

రాష్ట్రంలో ఈదురుగాలు, వడగళ్ల వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్నదాతలకు అకాల వర్షాలు నష్టాలను మిగిల్చాయి. ఇల్లందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో మొక్కజొన్న, మిరప, పొద్దుతిరుగుడు పంటలు నేలవాలాయి. మధిర , చింతకాని, బోనకల్లు, తల్లాడ, సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు , వైరా మండలాల్లో దెబ్బతిన్న పంటలను కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు మిరప రాలిపోయింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. ఎండబెట్టిన మొక్కజొన్నలు కొట్టుకుపోయాయి. వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చి మూడు రోజులైందని.. ఇప్పటికైనా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మామిడి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. ట్రాక్టర్లపై చెట్టు విరిగిపడడంతో ఇంజన్లు ధ్వంసమయ్యాయి. యాసంగి సాగులో వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదని.. ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతమైందని రైతులు దిగాలు చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా డోంగ్లిలో శనగ కొనుగోలు కేంద్రంలో బస్తాలు తడిసిపోయాయి.

ప్రాథమిక సమాచారం మేరకు ప్రభుత్వం చర్యలు‍: రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతినటంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పంటనష్టంపై ప్రాథమిక సమాచారం మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మామిడి, గులాబీ, ఉల్లిగడ్డ, బొప్పాయి, పుచ్చకాయ, వంటి ఉద్యాన పంటలు, పలుచోట్ల మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు వికారాబాద్‌ జిల్లాలో పర్యటించారు.

ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి: జహీరాబాద్, కోహిర్ మండలాల్లో 90శాతానికి పైగా పంట నష్టపోయినట్లుగా అధికారులు గుర్తించారు. నష్టానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపుతామని వారికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారులు.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

"మొక్కజొన్న, మిరప, టమాటా, మామిడి, గులాబీ, ఉల్లిగడ్డ, బొప్పాయి, పుచ్చకాయ పంటలు వడగండ్ల వర్షానికి దెబ్బతిన్నాయి. వర్షానికి పంటలు నేలవాలాయి. పండించిన పంట వర్షానికి కొట్టుకుపోయాయి. దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నాం. - బాధిత రైతులు

ఇవీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన భీభత్సం

పేపర్ లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్‌సీకి సిట్ నివేదిక

'నెహ్రూ' ఇంటి పేరుపై రగడ.. మోదీకి కాంగ్రెస్​ ప్రివిలేజ్​ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.