ETV Bharat / state

Crop Loss : కల్లాల్లో మొలకెత్తుతున్న పంట.. ఆగుతున్న రైతు గుండె - crop loss in telangana due untimely rains

crop loss in telangana : తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని.. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం మొలకలు వస్తుంటే... తేమ పేరుతో అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ అన్నదాతలు ఆరోపిస్తున్నారు. పలు చోట్ల ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. తడిసిన ధాన్యాన్ని చూసి.. కామారెడ్డి జిల్లాలో మనస్తాపానికి గురై.. ఓ రైతు గుండె ఆగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం.. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటామంటూ... రైతుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

crop loss in telangana
విక్రయానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దై.. మొలకలెత్తుతున్న పంట
author img

By

Published : May 6, 2023, 10:17 AM IST

Updated : May 6, 2023, 10:26 AM IST

కల్లాల్లో మొలకెత్తుతున్న పంట.. ఆగుతున్న రైతు గుండె

crop loss in telangana: అకాల వర్షాలు... రాష్ట్ర రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వర్షానికి పంట దెబ్బతినడంతో.. మనస్థాపానికి గురైన రైతు గుండెపోటు వచ్చి మృత్యువాతపడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దోమకొండకు చెందిన రైతు తిప్పాపురం కృష్ణమూర్తి... తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో వరి సాగు చేశాడు. భారీ వర్షాలకు సాగు చేసిన వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. కోత కొయ్యకముందే వరి గింజలన్నీ నేలరాలిపోయాయి. దీంతో రైతు కృష్ణమూర్తి మనస్థాపానికి గురవడంతో.. గురువారం రాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే కామారెడ్డి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి చెందాడు.

Crop Damage in Telangana : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాత అరిగోస పడుతున్నాడు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నెలన్నర రోజుల కిందటే ప్రణాళికలు రూపొందించుకుని సిద్ధంగా ఉన్నా.. పంటను వెనువెంటనే కొనుగోలు ప్రక్రియ చెపట్టలేదు. మెదక్‌ జిల్లాలో ధాన్యం మొలకలు వచ్చి 23 వేల మంది రైతులు నష్టపోయారు. కొందరు రైతులు తడిసిన ధాన్యాన్ని ఎండకు ఆరబెట్టి కుప్పలు పోయక ముందే... అకాల వర్షం వల్ల ధాన్యం తడిసిపోయింది. కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులకు భరోసా ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో కొనుగోలు చేయట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై ఆందోళనకు దిగారు. అకాల వర్షానికి తరచూ ధాన్యం తడిసిపోవడంతో మొలకలు వస్తున్నాయని.. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగం పెంచి.. కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

పూర్తిగా తడిచిన ధాన్యం: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో... విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. సుమారు 5 వేల క్వింటాళ్ల ధాన్యం తడిచినట్లు అధికారులు అంచనా వేశారు. వీణవంక మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పరిశీలించారు. తడిచిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లికి చెందిన రాములు, అయిలయ్య అనే రైతులు కోసిన ధాన్యం.. చెరువుపాలయ్యింది. గ్రామ శివారులోని రాజన్న ఆలయం వద్ద ఉన్న బండపై ఆరబోసిన ధాన్యం... అకాల వర్షానికి రాజన్న చెరువులోకి కొట్టుకుపోయింది. నోట మాట కూడా రాలేదని దుస్థితిలో ఉన్న రాములు పరిస్థితిని చూసి.. తోటి రైతులు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అతన్ని ఆదుకోవాలని వేడుకున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్, డిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పరిశీలించారు. ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని... ధాన్యం కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని... మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్‌ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడానికి వెనుకాడడంతో.. కేసీఆర్‌ ముందుకు వచ్చారని ఆయన వెల్లడించారు. తేమ శాతం పేరుతో... అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం చేయవద్దంటూ... అన్నదాతలు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 6, 2023, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.