ETV Bharat / state

వాట్సాప్, ట్విటర్, టిక్​టాక్​ యాప్​లపై క్రిమినల్​ కేసు

దేశంలో తొలిసారిగా ప్రధాన సోషల్ మీడియా యాప్స్​ వాట్సాప్, ట్విటర్, టిక్ టాక్​పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్​ 14 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్.. సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు నమోదు చేయమని ఆదేశించారు.

Criminal case against social media apps at cyberabad
సోషల్ మీడియా యాప్​లపై క్రిమినల్​ కేసు
author img

By

Published : Feb 28, 2020, 6:16 AM IST

Updated : Feb 28, 2020, 7:17 AM IST

హైదరాబాద్​ 14 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో సైబర్​ క్రైమ్​ పోలీసులు.. సోషల్ మీడియా యాప్స్​ వాట్సాప్, ట్విటర్, టిక్ టాక్​పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సీసీఎస్​లోని సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 374/2020 నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ సిల్వేరి శ్రీశైలం సదరు యాప్స్​పై కోర్టుకు వెళ్లారు. స్పందించిన కోర్టు తక్షణ విచారణ ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 12న భారత పార్లమెంట్​లో పౌరసత్వసవరణ చట్టం ప్రవేశపెట్టారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా యాప్స్ శాసనాన్ని ధిక్కరిస్తున్నాయని శ్రీశైలం స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడం వల్ల కోర్టును ఆశ్రయించారు.

సోషల్ మీడియా గ్రూప్స్​లో సున్నితమైన మతపరమైన అంశాలను రెచ్చ గొడుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాట్సాప్, ట్విటర్, టిక్ టాక్ వేదిక అవుతోందని కోర్టుకు శ్రీశైలం తెలిపారు. పరిశీలించిన మెజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని సైబర్ పోలీసులను ఆదేశించింది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153ఏ, 121ఏ, 124, 124ఏ, 294, 295ఏ, 505, 120బీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు చేశారు.

సోషల్ మీడియా యాప్​లపై క్రిమినల్​ కేసు

ఇవీచూడండి:'అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి'​

Last Updated : Feb 28, 2020, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.