గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా తన నివాసం వద్ద భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ప్రతిఒక్కరూ ఉద్యమంలా చేపట్టి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ, సినీనటి కాజల్ అగర్వాల్, ప్రముఖ వెంచర్ క్యాపటలిస్ట్ వాణీ కోలా, ప్రముఖ క్రీడా పాత్రికేయుడు బొరియా మజుందర్కు మిథాలీ గ్రీన్ సవాల్ విసిరారు.
ఇదీ చూడండి: ఆకట్టుకున్న కంబైన్డ్ పాసింగ్ పరేడ్.. విమానాల విన్యాసాలు