సులువుగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో యువత అడ్డదారి పడుతూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లక్షల 70 వేల నగదు, కంప్యూటర్, చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటకు చెందిన అధిత్ గేమవత్, పరమేష్, విజయ్ కుమార్ తమ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారితో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందటం వల్ల వారిని అరెస్టు చేశారు. వీరంతా రాజస్థాన్, కర్ణాటక నుంచి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరు గత కొన్ని రోజులుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: 'సూపర్' థ్రిల్లర్ మ్యాచ్లో విశ్వవిజేతగా ఇంగ్లాండ్