Eduspark summit and awards : యానిమేషన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తున్న ఎడ్యుస్పార్క్ సమ్మిట్ అండ్ అవార్డ్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఎడ్యుటెక్ మీడియా సంస్థ క్రియేటివ్ మల్టీమీడియా సంస్థ "అడ్వకేట్ ఫర్ యానిమేషన్ ఎడ్యుకేషన్ అవార్డు"కు ఎంపికైంది. శనివారం ఈ అవార్డును ముంబయిలోని బాంద్రాలో రహేజా ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో క్రియేటివ్ మల్టీమీడియా సీఈవో రాజశేఖర్ బుగ్గవీటికి ప్రదానం చేశారు.
యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు కృషి చేసి, నేటి తరాలకి అందిస్తున్న వారికి ఈ అవార్డులను.. గ్లోబల్ ఎడ్యుస్పార్క్ సంస్థ గత రెండేళ్లుగా అందిస్తోంది. స్వర్ణయుగంలోకి ప్రవేశం (ఎంటరింగ్ ఏ గోల్డెన్ ఏజ్) పేరిట గత శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో చర్చలు, సదస్సులు నిర్వహించారు. అనంతరం పురస్కారాలను ప్రదానం చేశారు. గతేడాది జరిగిన ఎడ్యుస్పార్క్ పురస్కారాల కార్యక్రమంలో రాజశేఖర్ బుగ్గవీటి ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. ఈ సంవత్సరం క్రియేటివ్ మల్టీమీడియాకు అవార్డు రావడం పట్ల సంస్థ సీఈవో రాజశేఖర్ బుగ్గవీటి హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ద్వారా యానిమేషన్ విద్యను మరింత మంది విద్యార్థులకు అందించడంలో.. తమ బాధ్యత పెంచిందని పేర్కొన్నారు.
1998లో స్థాపించిన క్రియేటివ్ మల్టీమీడియా గ్రూప్.. క్రియేటివ్ మల్టీమీడియా అకాడమీ, క్రియేటివ్ మల్టీమీడియా కాలేజ్ ఆఫ్ ఫైన్ అర్ట్స్ పేరిట రెండు సంస్థలు స్థాపించి యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్ రంగంలో శిక్షణనిస్తున్నాయి. మల్టీమీడియా రంగానికి అవసరమైన మానవ వనరులను అందించే సంస్థలుగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ కోర్సులతో మల్టీమీడియా రంగంలో ఉద్యోగావకాశాలను ఒడిసిపట్టేందుకు విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతున్నాయి. రెండున్నర దశాబ్దాల ప్రస్థానంలో క్రియేటివ్ మల్టీమీడియా గ్రూప్.. దేశవ్యాప్తంగా ఎందరో విద్యార్థులను మల్టీమీడియా రంగం వైపు ఆకర్షించడమే కాకుండా ఏకంగా 27 వేల మందిని మల్టీమీడియా రంగంలో నిలదొక్కుకునేందుకు వెన్నుదన్నుగా నిలిచింది.
ఇవీ చదవండి: