సాధారణంగా ఆవులను పాల వనరుగా భావిస్తారు. ఆ పాలను వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. కానీ.. హైదరాబాద్ గోషామహాల్‌కు చెందిన రాము ఆవు పేడ, మూత్రంతో రాఖీలు, వినాయక విగ్రహాలు రూపొందించారు. ప్రస్తుతం దీపావళి, కార్తీకమాసం దృష్టిలో ఉంచుకొని ప్రమిదలు తయారు చేస్తున్నారు. ఈ వస్తువులకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోందని అంటున్నారు.
అత్తాపూర్‌లోని గోశాలలో గోమూత్రం, పేడ సేకరించి ప్రమిదలు తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించవచ్చని తెలిపారు. ఒక్కో ప్రమిదను నాలుగు రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు వెల్లడించారు. వీటిని మరింత తక్కువ ధరకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు.
భవిష్యత్‌లో ఆవు పేడతో కర్రలు తయారు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. పర్యావరణ రక్షణ కోసం మృతదేహాలను కాల్చేందుకు వీటిని ఉపయోగించేలా రూపొందిస్తానని వివరించారు. ఇలా తయారు చేసే ప్రమిదలు, వినాయక విగ్రహాలు, రాఖీల తయారీ గురించి ఆసక్తి ఉన్నవాళ్లకి నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఇదీ చదవండి: మహా దీపోత్సవ వెలుగుల్లో పులకించిన అయోధ్య