మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళలో సందర్శకుల సందడి నెలకొంది. గురువారం సాయంత్రం శిల్పారామం ఆంఫి థియేటర్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీమతి రమణి సిద్ధి గారి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
ఆనంద గణపతి, జయము జయము, రామాయణ శబ్దం, శివ పాద మంజీరా నాదం, కొలువైతివారంగా సాయి, బృందావన నిలయేహ్, భామాకలాపం, కృష్ణం కలయ సఖి అంశాలను అన్షు, మహిత, ప్రియవర్షిణి, సరిత, సింధు, చంటి, హాసిని, దినకర్, మీనా, పుష్పలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
ఈ మేళాలో హ్యాంగింగ్స్, పిల్లో కవర్లు, బ్యాగులు, క్రోషియా వర్క్ టేబుల్ క్లోత్స్, బంజారా వర్క్ బాగులు, డోర్ మాట్స్, రాజస్థానీ పెయింటింగ్ వర్క్స్ ఇలా దాదాపు 400 స్టాళ్లను శిల్పారామంలో ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: దేశంలో మరో 23,068 మందికి వైరస్