ETV Bharat / state

సీఎం కేసీఆర్ ఆలోచనను స్వాగతిస్తున్నాం: తమ్మినేని - CPM SECRETARY TAMMINENI VEERABHDRAM WELCOMES KCR THOUGHT

హైదరాబాద్​లోని సీపీఎం కార్యాలయం ఎంబీ భవన్​లో రాష్ట్ర కార్యదర్శి వర్గం సమావేశమైంది. పలు తీర్మనాలు చేసిన కార్యదర్శివర్గం... మతోన్మాదంపై సీఎం కేసీఆర్​ చేసిన  అఖిలపక్ష సభ ఆలోచనను స్వాగతించింది. మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

CPM welcomes the idea of CM KCR about NPR, NRC, CAA

author img

By

Published : Dec 26, 2019, 9:57 PM IST

మతోన్మాదంపై సీఎం కేసీఆర్‌ అఖిలపక్ష సభ ఆలోచన సబబైందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీ, సీఏఏను అమలు జరపబోమని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వివిధ రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రుల అధ్వర్యంలో దీక్షలు, భారీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ మౌనంగా ఉండటం పట్ల తెలంగాణ సమాజం ఆందోళన చెందుతుందన్నారు. జనవరి 30న గాంధీ వర్థంతి రోజు సందర్భంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా భాజపాయేతర పార్టీలతో అఖిలపక్ష సభను జరపాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకే భాజపా,ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు.

రిజర్వేషన్లు ప్రకటించకుండానే షెడ్యూలేంటీ?

మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడమేంటని వీరభద్రం ప్రశ్నించారు. సంక్రాంతి పండగ, జనవరి 8న కార్మిక సమ్మె-గ్రామీణ బంద్‌ను దృష్టిలో పెట్టుకోకుండా తేదీలను ప్రకటించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. షెడ్యూల్‌లో మార్పులు చేయాలని కోరుతూ... రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలవాలని కార్యదర్శివర్గ సమావేశం నిర్ణయించదని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'

Intro:Body:

tg_hyd_46_26_cpm_on_kcr_dry_3182061_2612digital_1577366272_677

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.