నిత్యావసరాల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతుండడంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి బాధల్లో ఉన్న పేదలకు.. ధరల పెంపుతో బతుకు భారమైందన్నారు. ప్రభుత్వాలకు.. నిరుపేదల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తక్షణమే ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు.
వంట నూనెలలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు సంవత్సర కాలంలో రెట్టింపు అయ్యాయని తమ్మినేని ప్రస్తావించారు. సిమెంటు, స్టీలు ధరల పెంపుతో నిర్మాణ రంగం ఖర్చు భారమైందని మండి పడ్డారు. ప్రభుత్వాలు ప్రజల కష్టాలు పట్టించుకోకుండా.. కార్పొరేట్ల జేబులు నింపుతున్నాయని విమర్శించారు. నిత్యావసరాల ఎగుమతులు నిలిపివేసి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: Malla Reddy: పేకాట స్థావరానికి అడ్డా మంత్రి మల్లారెడ్డి గార్డెన్..!