రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడిన ప్రజాప్రతినిధులందరిపైనా కేసులు పెట్టాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు డిమాండ్ చేశారు. ఆక్రమణల వివరాలు ప్రభుత్వానికి అందించినప్పటికీ... ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఒక్క ఈటల రాజేందర్ మీద మాత్రమే చర్యలు తీసుకుంటే రాజకీయ చర్యగా ప్రజలు భావిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు... ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగాలన్నారు.
ఇదీ చూడండి: నీ అరెస్టులకు.. కేసులకు భయపడే వ్యక్తిని కాదు: ఈటల