ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను సీపీఎం ప్రతినిధి బృందం పరామర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్, డి.జి. నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.ప్రభాకర్ నగరంలోని ఆంధ్రజ్యోతి డైరెక్టర్ రాధాకృష్ణ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి: ఎన్నికలు పెట్టి ప్రజలను ఆశ్చర్యపరచవద్దు: హైకోర్టు