రాష్ట్రంలో కరోనా మొదటి దశ కంటే రెండో దశలోనే మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. తక్షణమే మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఆలోచించాలన్నారు. సభలు, సమావేశాల ద్వారా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని గుర్తు చేశారు. వారిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం వైరస్ సోకిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు ముఖ్యమని... వారికి రక్షణ లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ అంత మంచిది కాదని చెప్పారు.
ఇదీ చదవండి: నగరంలో కరోనా పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ