ETV Bharat / state

సీపీఐ రాజ్​భవన్​ ముట్టడి ఉద్రిక్తం

ఇంటర్మీడియట్​ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సీపీఐ నగర కమిటీ రాజ్​భవన్​ ముట్టడికి యత్నించింది. పోలీసులు వారిని అడ్డుకోగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

author img

By

Published : May 4, 2019, 4:20 PM IST

సీపీఐ రాజ్​భవన్​ ముట్టడి ఉద్రిక్తం

ఇంటర్​ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ సీపీఐ నగర కమిటీ ఈరోజు రాజ్​భవన్​ ముట్టడికి ప్రయత్నించింది. ఖైరతాబాద్​ రైల్వే స్టేషన్​ నుంచి రాజ్​భవన్​కు ర్యాలీగా బయలు దేరిన సీపీఐ నేతలను పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీపీఐ రాజ్​భవన్​ ముట్టడి ఉద్రిక్తం

గ్లోబరీనా యజమానిని అరెస్టు చేయాలి

విద్యార్థుల బలవన్మరణానికి కారణమైన గ్లోబరీనా యజమానిని అరెస్టు చేసి విద్యాశాఖ మంత్రి బర్తరఫ్​ చేయాలని సీపీఐ నగర కార్యదర్శి నరసింహా డిమాండ్ చేశారు. రీవెరిఫికేషన్​, రీ వాల్యూయేషన్​ ఉచితమని చెప్పినా అంతర్గతంగా సున్నా మార్కులొచ్చి ఫెయిలైన వారి పేపర్లు మాత్రమే పునఃమూల్యాంకనం చేస్తున్నారని మండిపడ్డారు.

గవర్నర్​ స్పందించాలి

దరఖాస్తు చేసుకున్న వారందరి పేపర్లు రీవెరిఫికేషన్​ కాకుండా రీవాల్యుయేషన్​ చేయాలని అప్పుడే వారు ఎలా రాశారో లోపం ఎక్కడుందో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు ఉందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్​ అయినా ఈ విషయంపై స్పందించి విద్యార్థుల భవిష్యత్​కు భరోసా ఇవ్వాలని కోరారు.

ఇదీ చూడండి : నిన్న దీక్ష విరమణ... నేడు డిశ్చార్జ్...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.