ETV Bharat / state

'ముఖ్యమంత్రి కేసీఆర్​ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు'

ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా ఓటేసిన కేసీఆర్‌ రేపు నిర్వహించబోయే సార్వత్రిక సమ్మెకు నాయకత్వం వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్‌ చేశారు. దిల్లీలోని జేఎన్​యూ విద్యార్థులపై దుండుగుల దాడిని ఖండించారు.

author img

By

Published : Jan 7, 2020, 11:00 PM IST

cpi press meet
'కేసీఆర్​ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు'

ఎన్‌ఆర్సీని వ్యతిరేకించిన కేసీఆర్‌.. చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జరుగుతున్న పోరాటాలను అణచి వేస్తూ.. ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. జేఎన్‌యూలో విద్యార్థులపై గుండాలు దాడి చేయడం బాధాకరమన్నారు. ఈ దాడి వెనుక కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయం ఉందని ఆరోపించారు. దాడిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని... ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఓటరు జాబితా సిద్ధం కాకుండానే, రిజర్వేషన్లు ఖరారు కాకుండానే ఎన్నికల కమిషన్‌ మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడాన్ని రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్‌ మెప్పుకోసమే ఎన్నికల కమిషన్‌ తొందరపాటు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కలిసి వచ్చే శక్తులతో ముందుకు వెళ్తామని చాడ వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.