ETV Bharat / state

D Raja on BJP : '2024 ఎన్నికల్లో కేంద్రంలో భాజపాకు చుక్కెదురు ఖాయం' - కేంద్ర ప్రభుత్వంపై డిరాజా విమర్శలు

D Raja on BJP: కేంద్రంలో భాజపా ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో చుక్కెదురు కాబోతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. దేశంలో భాజపా, ఆర్ఎస్ఎస్‌ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డితో కలిసి హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడారు.

D Raja
D Raja
author img

By

Published : Jan 8, 2022, 6:57 PM IST

D Raja on BJP : ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కులేకుండా చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ఎన్నికల్లో భాజపా... డబ్బు పవర్‌ను ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర విధానాలతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ హక్కులను కోల్పోతున్నాయని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం... ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందన్నారు. జాతీయ స్థాయిలో బ్యాంక్ ఉద్యోగులు వచ్చే నెలలో సమ్మె చేస్తున్నారని... ఆ ఉద్యమానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం భాజపా తీరుపై ఆలోచించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. నిరుద్యోగుల ఆందోళన దృష్ట్యా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

అన్ని రాష్ట్రాలను సమన్వయం చేయాల్సిన పార్టీ.... కానీ వాళ్లే రాష్ట్ర హక్కులు హరిస్తున్న నేపథ్యంలో కేసీఆర్​ ప్రభుత్వం కూడా కేంద్ర భాజపా, ఎన్డీఏ ప్రభుత్వ తీరుతెన్నులపై సీరియస్​గా తీసుకోవాలి. ధాన్యం కొనుగోలు విషయంలో జరిగిన అంశాలు, ఇతర అంశాల గురించి కూడా ఆలోచించాలి. దానితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్​... అన్ని ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ విజ్ఞప్తి చేస్తోంది. - చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

'2024 ఎన్నికల్లో కేంద్రంలో భాజపాకు చుక్కెదురు'

ఇదీ చూడండి: Ministers on Shivraj singh: 'వంద ఎలుకలు తిన్న పిల్లి శాకాహారిని అన్నట్లు ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.