ETV Bharat / state

CPI ON DRUGS CASE: 'సినిమా నటులను కాదు... డ్రగ్స్ తయారు చేసే వాళ్లని పట్టుకోవాలి' - సీపీఐ వార్తలు

మాదక ద్రవ్యాలను సేవించే వాళ్లను కాకుండా తయారు చేసే వాళ్లను పట్టుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana)... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్య ప్రజలను నిలువునా దోపిడీ చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి (Chada venkat reddy) మండిపడ్డారు.

CPI ON DRUGS CASE
సీపీఐ
author img

By

Published : Oct 6, 2021, 2:24 PM IST

సీపీఐ జాతీయ మహాసభలు వచ్చే ఏడాది అక్టోబర్ 14 నుంచి 18వరకు ఏపీలోని విజయవాడలో జరగనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) ప్రకటించారు. మహాసభలు ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సి ఉండగా కొవిడ్‌ నేపథ్యంలో నిర్వహించలేకపోయామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అంశాలను మహాసభల్లో చర్చించనున్నట్లు వెల్లడించారు.

'' కేంద్రమంత్రి కుమారుడు రైతుల మీదకు కాన్వాయ్​తో దూసుకుపోయి చంపేశాడు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు రైతులే తన కుమారుడిని చంపడానికి వచ్చారని కేంద్రమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిరసనలు తెలుపుతున్న బాధితులను పరామర్శించడానికి వచ్చిన వారిని గృహ నిర్బంధం చేస్తున్నారు. కార్లతో రైతులను చంపించి... నేరం తన మీదకు రాకుండా కేంద్రం చూసుకుంటుంది. దేశంలో డ్రగ్స్ విచ్చలవిడిగా విస్తరిస్తోంది. మాదక ద్రవ్యాలను సేవించే వాళ్లనే కాదు.. తయారు చేసే వాళ్లను సైతం పట్టుకోవాలి. సినీనటులను కాదు డ్రగ్స్‌లో ఆధాని లాంటి వాళ్లను పట్టుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేస్తోంది. ఇండియన్ ఎయిర్ లైన్స్​ను టాటాకి అప్పగించారు. సుప్రీంకోర్టు చెప్పినా 25ఏ ను కేంద్ర ప్రభుత్వం తొలగించడం లేదు. క్షణం కూడా మోదీకి దేశ ప్రధానిగా ఉండే అర్హత లేదు.

-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana)

విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాస్​లు కాకుండా 100 శాతం ఫిజికల్​గా అటెండ్ అయ్యేలా క్లాస్​లు నిర్వహించాలని సూచించారు. రాజీవ్ స్వగృహకల్పని అమ్మకానికి పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నారాయణ మండిపడ్డారు. ఇది అమ్మితే మీ నాన్నని అమ్మినట్టే అంటూ వ్యాఖ్యానించారు.

సీపీఐ

నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేటర్ దిగ్గజాలకు పెద్ద పీఠ వేస్తోంది. ధరలు పెంచి ప్రజలను నిలువు దోపిడీ చేస్తోంది. మోదీ అచ్చేదిన్ అన్నాడు.. అచ్చేదిన్ కాదు చచ్చేదిన్ వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ అమ్మేస్తున్నారు. పోడు సాగుదారులపై అటవీశాఖ అధికారులు దాడులకు పాల్పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. పోడు సాగుదారుల పొట్టకొట్టకుండా.. పట్టాలు ఇవ్వాలి. లేనిపక్షంలో ప్రతిపక్షాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.

చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి (Chada venkat reddy)

ఇదీ చూడండి: Bigg Boss Telugu 5: 'బిగ్ బాస్ షోతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు'

Chada venkat reddy: గొడవలు సృష్టించేందుకు భాజపా కుట్ర: సీపీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.