ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నేతలు చేపట్టిన దీక్షలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతుండగా... ఆయన పక్కనే మంత్రి అవంతి శ్రీనివాస్, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉన్నారు.
వీరిద్దర్నీ ఉద్దేశిస్తూ... 'మంత్రి అవంతి శ్రీనివాస్ పై ఒక బాధ్యత ఉంది. ఎమ్మెల్యే గంటాపై ఒక బాధ్యత ఉంది. జగన్‌ను అవంతి తీసుకువస్తే.. చంద్రబాబును గంటా తీసుకురావాలి. ఆ ఇద్దరూ ఒకే వేదికపైకి వస్తే స్టీల్ ప్లాంట్‌ను తప్పక సాధిస్తాం' అంటూ నారాయణ వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన మంత్రి అవంతి.. జగన్, చంద్రబాబుకు నారాయణ స్నేహితుడని, ఆయనే ఈ బాధ్యత తీసుకుంటే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తూ వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీపీ అంజనీకుమార్ టగ్ ఆఫ్ వార్