ETV Bharat / state

ఇదేనా శాస్త్రవేత్తలకు ఇచ్చే గౌరవం: సీపీఐ నారాయణ

author img

By

Published : Apr 28, 2021, 5:31 PM IST

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. భారత్​ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్లాను తన కార్యాలయానికి పిలిపించుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

భారత్​ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్లాను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ తన కార్యాలయానికి పిలిపించుకోవడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రావీణ్యత పొందిన శాస్త్రవేత్త అనేక వ్యాక్సిన్​లను తయారు చేసి... 70 దేశాలకు సరఫరా చేస్తున్నారని కొనియాడారు.

కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడాన్ని సవాల్​గా తీసుకుని మరోసారి ప్రపంచ కొవిడ్​ బాధితులకు అండగా నిలబడ్డారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అపత్కాలంలో సహాయం అడగడానికి భారత్​ బయోటెక్ ఉన్న తుర్కపల్లికి వెళ్లాల్సిన సోమేశ్​కుమార్​ క్షణం తీరిక లేకుండా గడిపే కృష్ణ ఎల్లాను తన కార్యాలయానికి పిలిపించుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదేనా శాస్త్రవేత్తలకు ఇచ్చే గౌరవమని ప్రశ్నించారు. గతంలో ప్రధానకార్యదర్శులకు ప్రత్యేక, పవిత్ర స్థానం ఉండేదని.. ఇప్పుడు ముఖ్యమంత్రులకు పనిమనుషులుగా మారిపోయారని చెప్పడానికి విచారపడుతున్నానన్నారు.

ఇదీ చూడండి : వ్యాక్సిన్ వేసుకోవాలని సీఎం ఎందుకు చెప్పటం లేదు: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.