ఆర్థిక సంక్షోభరీత్యా ప్రజలపై కేంద్రం పన్నుల భారాన్ని తగ్గించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ... వామపక్షాలు హైదరాబాద్ నారాయణగూడలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని... ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్థిక పరమైన నేరాలు, పేద ప్రజానీకానికి జరిగిన అన్యాయాలను పరిష్కరించకుండా... అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు మోదీ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజానికాన్ని పక్కనబెట్టి.... సంపన్న వర్గాలకు మేలు జరిగేలా ప్రధాని పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ... ఈ నెల 16 వరకు ఆందోళనలు కొనసాగిస్తామని... అప్పటికీ మోదీ వైఖరి మారకపోతే ప్రత్యక్షపోరుకు సిద్ధమవుతామని నారాయణ హెచ్చరించారు.
ఈ కథనం చదవండి : ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి