సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని నారాయణగూడ ఏఐటీయూసీ కార్యాలయం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్థూం భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో చాడ పేర్కొన్నారు.
ఈ వేడుకలకు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చాడ తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం, పోరాటాల చరిత్రను కళాకారులు తమ ఆటపాటలతో తెలియజేయనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 16 మందికి కరోనా