ETV Bharat / state

'సుల్తాన్​బజార్​ వీధి వ్యాపారులను ఆదుకోవాలి'

author img

By

Published : Sep 19, 2020, 3:24 PM IST

మెట్రో నిర్మాణం కారణంగా ఉపాధి కోల్పోయిన సుల్తాన్​బజార్​ వీధి వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్​పాషా డిమాండ్​ చేశారు. వారికి స్థలాలు కేటాయించాలని కోరారు.

cpi demanding that Sultan Bazaar should support street vendors
'సుల్తాన్​బజార్​ వీధి వ్యాపారులను ఆదుకోవాలి'

హైదరాబాద్ సుల్తాన్ బజార్ వీధి వ్యాపారులకు అక్కడే స్థలాలు కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేసింది. మెట్రో కారణంగా ఉపాధి కోల్పోయి వీధిన పడిన సుల్తాన్ బజార్ వ్యాపారులకు వ్యాపారం చేసుకోవడానికి అక్కడే స్థలాలు కేటాయించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుల్తాన్ బజార్ మార్కెట్ హ్యాకర్ల సంఘం ఆధ్వర్యంలో దాదాపు 200 మంది వీధి వ్యాపారులు హిమాయత్​నగర్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి తమ జీవనోపాధిని కాపాడాలని మొరపెట్టుకున్నారు.

ఈ సందర్భంగా సుల్తాన్ బజార్ వీధి వ్యాపారులకు ఉపాధి కల్పిస్తామని అజీజ్​ పాషా పేర్కొన్నారు. మెట్రో నిర్మాణ సమయంలో వీధి వ్యాపారులకు స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు స్థలాలు కేటాయించకపోవడం అన్యాయమని అజీజ్ పాషా విమర్శించారు. 40 ఏళ్ల నుంచి వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వారిని ఉన్నపళంగా వెళ్లిపొమ్మంటే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వీధి వ్యాపారులకు స్థలాలు కేటాయించాలని.. లేని పక్షంలో సమస్య పరిష్కారం అయ్యే వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చూడండి: తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన నిర్లక్ష్యపు "నాలా "

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.