ETV Bharat / state

ఈనెల 13న ఛలో హైదరాబాద్​ కలెక్టరేట్​ మహాధర్నా: చాడ

డబుల్​బెడ్​రూం ఇళ్ల విషయంలో ప్రజల తరఫున ఈనెల 13న ఛలో హైదరాబాద్​ కలెక్టరేట్​ మహాధర్నా నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ప్రకటించారు. దానికి సంబంధించిన గోడపత్రికను హైదరాబాద్​లోని​ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.

cpi chalo hyderabad Collectorate Maha Dharna
ఈనెల 13న ఛలో హైదరాబాద్​ కలెక్టరేట్​ మహాధర్నా: చాడ
author img

By

Published : Oct 7, 2020, 3:00 PM IST

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేద ప్రజల ఆశలను అడియాశలు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. నగరంలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికి రెండుపడక గదుల ఇళ్లు‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ... ఈనెల 13న ఛలో హైదరాబాద్‌ కలెక్టరేట్‌ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఛలో హైదరాబాద్‌ కలెక్టరేట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో చాడ వెంకట్‌రెడ్డితో పాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యలు సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ఛాయాదేవి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో, ఎంత మందికి ఇళ్లు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలని చాడ డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన పథకం కింద రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు ఇస్తారో మంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.

ఇదీ చూడండి: తెరాస, భాజపా ఒక తాను ముక్కలే: గూడూరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.