ETV Bharat / state

డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చాలి: సీపీఐ - dengue

రాష్ట్రంలో డెంగీ ప్రబలడానికి కారణం ప్రభుత్వం దోమల నివారణలో అలసత్వం ప్రదర్శించడమేన్నారు సీపీఐ నేతలు. హైదరాబాద్​లోని హిమాయత్​నగర్​ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ దోమల బ్యాట్​తో వినూత్న నిరసన చేపట్టారు.

డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చాలి: సీపీఐ
author img

By

Published : Sep 14, 2019, 5:06 PM IST

దోమల నివారణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్​లో సీపీఐ వినూత్న నిరసన చేపట్టింది. హిమాయత్​నగర్ కూడలిలో దోమలను చంపే బ్యాట్లతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దోమల నివారణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే డెంగీ రోగులు పెరిగారని సీపీఐ నాయకులు ఆరోపించారు. నగర అపరిశుభ్రత వల్ల దోమలు వ్యాప్తి చెందాయని... దీంతో నగర జనం జ్వర పీడితులుగా మారారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చి రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారి ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

డెంగీపై సీపీఐ వినూత్న నిరసన

ఇవీ చూడండి:ఫాలో అవడం అంటే మరీ ఇలా చేయాలా...!

sample description

For All Latest Updates

TAGGED:

cpidengue
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.