కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని సైబరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar) అన్నారు. ప్రముఖ వైద్యులు డా.వరుణ్ రాజు వ్యాక్సిన్ అవగాహనపై రూపొందించిన వీడియోను ఆయన ఆవిష్కరించారు. 3 నిమిషాల నిడివిలో చక్కటి సందేశాత్మకమైన వీడియోను రూపొందించారంటూ వైద్యుడిని కొనియాడారు.
ప్రజలకు వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలని తొలగించాలనే ఉద్దేశంతో వీడియోను రూపొందించినట్లు వరుణ్ తెలిపారు. వీడియోకు మరింత ప్రచారం కల్పించాలని సీపీ కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ హనుమంతరావ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వారికి మాస్కు నిబంధన నుంచి విముక్తి