కరోనా కట్టడికి పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. కూకట్పల్లిలోని పలు ప్రాంతాల్లో వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. 10.10 దాటాక అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై లాఠీలు ఝుళిపించారు. ఈ తనిఖీలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ-పాస్లు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేయాలని సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. లింక్రోడ్లలో సైతం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం కావడంతో ఉదయం పూట మార్కెట్లలో పోలీసులను ఏర్పాటు చేసి.. ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు అనుమతులు లేకుండా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఉదయం నుంచి దుకాణాల వద్ద కిటకిట.. 10 తర్వాత స్తబ్ధత