కరోనా మూడో వేవ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొండాపూర్ మెడికవర్ ఆస్పత్రి రూపొందించిన బుక్‌లెట్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ విడుదల చేశారు. మూడో వేవ్‌లో కరోనా ఎలాంటి వ్యక్తులపై ప్రభావం చూపుతుంది, పిల్లలను కొవిడ్ బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి, కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే పలు రకాల అంశాలను క్లుప్తంగా ఈ బుక్లేట్లో పొందుపరిచారు.
మూడో వేవ్‌లో అత్యధికంగా చిన్న పిల్లలు కరోనా బారిన పడే అవకాశం ఎక్కువ అని అన్ని సర్వేలు తెలుపుతున్నందున… అందరం అత్యంత జాగ్రత్త వహించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో మెడికవర్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, సీనియర్ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ ఆస్పత్రికి 30 ఆక్సిజన్ సిలిండర్లు అందించిన మాజీ మంత్రి