హైదరాబాద్ నగరంలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అంజనీ కుమార్.. హైదరాబాద్ కమిషనరేట్‌కు సంబంధించిన వార్షిక నేర వివరాలను వెల్లడించారు. గొలుసు దొంగతనాల కేసులు 30 శాతం తగ్గాయని సీపీ పేర్కొన్నారు. ప్రాపర్టీ క్రైమ్ 2 శాతం తగ్గాయని తెలిపారు.
నేరాలలో నిందితులకు శిక్ష పడటంలో 42 శాతం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న వాళ్ళు డయల్ 100 నంబర్‌కు ఫోన్ చేస్తే 8 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో 25కోట్ల 6లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. నగరంలో డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను 119మంది అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: బోర్డు పునర్‌వ్యవస్థీకరణతో పట్టాలపైకి... రైల్వే!