ETV Bharat / state

శంషాబాద్​ విమానాశ్రయంలో విమెన్​ డెస్క్​ని ప్రారంభించిన సీపీ - సీపీ సజ్జనార్​

మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని సీపీ సజ్జనార్​ అన్నారు. ఈ మేరకు శంషాబాద్​ విమానాశ్రయంలో విమెన్​ డెస్క్​ని సజ్జనార్​ ప్రారంభించారు. ప్రయాణ సమయంలో మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా విమెన్​ డెస్క్​కి ఫిర్యాదు చేయాలని సూచించారు.

cp inaugurated women desk airport
శంషాబాద్​ విమానాశ్రయంలో విమెన్​ డెస్క్​ని ప్రారంభించిన సీపీ
author img

By

Published : Nov 9, 2020, 3:13 PM IST

మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని సైబరాబాద్ పోలీస్​ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ప్రతిరోజు శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 65 వేల మంది ప్రయాణికులు వస్తుంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఏర్పాటు చేసిన విమెన్ డెస్క్​లో ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. ఈ డెస్క్‌లో ఇద్దరు మహిళా పోలీసు అధికారిణిలు అందుబాటులో ఉంటారని తెలిపారు.

సేఫ్టీ కోసం 13 షీ టీమ్స్​

శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమెన్‌ డెస్క్‌ను డీసీపీ ప్రకాష్ రెడ్డితో కలిసి సజ్జనార్ ప్రారంభించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది కొరతలేదని.. మహిళా భద్రత కోసం 13 షీ టీమ్స్‌ పనిచేస్తున్నాయని సీపీ వివరించారు. మహిళలు ఫిర్యాదులు ఏమైనా ఉంటే 9490617135 నంబరును సంప్రదించాలని తెలిపారు.

కొత్తగా వచ్చిన ఎస్సై, కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చి దర్యాప్తు, పెట్రోలింగ్‌లో ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివిన అభ్యర్థులు సైతం పోలీసు ఉద్యోగంలో చేరుతున్నారని సజ్జనార్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రైతు ఆనందానికి వేదికైంది... నగరవాసికి కానుకైంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.