ETV Bharat / state

Hyderabad police new year celebrations : నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న హైదరాబాద్​ సీపీ - హైదరాబాద్​ పోలీసుల నూతన సంవత్సర వేడుకలు

Hyderabad police new year celebrations : నూతన సంవత్సర వేడుకలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుతల్లి ఫైఓవర్‌ ప్రధాన కూడలి వద్ద, సికింద్రాబాద్​ క్లాక్​టవర్​ వద్ద నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ.ఆనంద్‌ పోలీస్‌ సిబ్బందితో కలిసి కేక్​కట్‌ చేశారు.

new year celebrations
new year celebrations
author img

By

Published : Jan 1, 2022, 2:59 AM IST

Hyderabad police new year celebrations : హైదరాబాద్​లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్​ ప్రధాన కూడలి వద్ద హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్​ పోలీస్​ సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్​ కట్​ చేసి ఒకరికొకరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా సీపీ ఆనంద్​... హైదరాబాద్‌ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత రెండేళ్లుగా కొవిడ్​ మహమ్మారి ప్రభావంతో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని... 2022లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగర పోలీసులు ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుంటారని.. ట్రాఫిక్‌, డ్రగ్స్‌, నేరాలను నియంత్రిస్తామని తెలిపారు.

సికింద్రాబాద్​ క్లాక్​టవర్​ వద్ద

సికింద్రాబాద్ క్లాక్​టవర్​ వద్ద హైదరాబాద్ నగర పోలీసులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమానికి హాజరైన హైదరాబాద్​ సీపీ సీవీఆనంద్​ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరం అందరికీ కలిసిరావాలని, నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తితో పాటు ఏసీపీలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొత్త సంవత్సరం నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.