హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు థర్మో స్టీల్ వాటర్ కిట్స్ అందజేశారు. నారాయణగూడ, లిబర్టీ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఇచ్చారు. నగర పోలీస్ కమిషనర్‌తో పాటు మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి కానిస్టేబుల్ 24 గంటలు పని చేస్తున్నారని సీపీ తెలిపారు. ఎండను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నారని.. కొంత మందికి విధుల్లో గాయాలయ్యాయని చెప్పారు. నాలుగు ప్రదేశాల్లో కానిస్టేబుళ్లకు వాటర్ బాటిళ్లు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సీపీ అంజనీకుమార్ కోరారు.
ఇవీ చూడండి: ముందస్తు చర్యల వల్లే నియంత్రించ గలిగాం: తలసాని