హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కరోనా వైరస్ బారి నుంచి కోలుకుని విధుల్లో చేరిన ముగ్గురు హోం గార్డులను సీపీ అంజనీకుమార్ అభినందించారు. వాళ్లను ప్రశంస పత్రంతో పాటు బహుమతి అందించి విధుల్లోకి స్వాగతించారు. దేశంలోని మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో కరోనా అదుపులోనే ఉందని... అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంజనీ కుమార్ సూచించారు.
కరోనా వైరస్ బారిన పడ్డ పోలీసులు కొవిడ్‌ను అధిగమిస్తున్నారని... పోలీసులు ఆందోళన చెందకుండా ఆతస్థైర్యంతో ఉండాలని సీపీ అన్నారు. కరోనా విషయంలో ఆందోళన చెందకుండా... ముందస్తు జాగ్రత్త తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నపాటి వైద్యంతో కొవిడ్‌ను జయించవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పచ్చని పండుగ: రెండోరోజూ జోరుగా సాగిన హరితహారం