ETV Bharat / state

anjani kumar: టీకా కేంద్రాన్ని పరిశీలించిన సీపీ - కొవిడ్​ వ్యాక్సినేషన్​ కేంద్రం

హైద్రబాద్ పాతబస్తీ పరిధిలో ఉన్న పోలీస్​ ట్రైనింగ్ కేంద్రంలో పోలీసు కుటుంబాల కొరకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్​ కేంద్రాన్ని(Covid vaccine centre) నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్(anjani kumar) సందర్శించి పరిశీలించారు.

cp anjani kumar
anjani kumar: టీకా కేంద్రాన్ని పరిశీలించిన సీపీ
author img

By

Published : Jun 7, 2021, 7:24 PM IST

హైద్రబాద్ పాతబస్తీ పరిధిలో ఉన్న పోలీస్​ ట్రైనింగ్ సెంటర్​లో పోలీసు కుటుంబాల కొరకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్​ కేంద్రాన్ని(Covid vaccine centre) నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్(anjani kumar) సందర్శించారు. వ్యాక్సినేషన్ సరళిని పరిశీలించి టీకా తీసుకోవడానికి వచ్చిన వారిని కమిషనర్ పలకరించారు. కార్యక్రమంలో సీపీతో పాటు దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఆరోగ్యశాఖ తరుఫున వచ్చిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, వారి సిబ్బందికి హైదరాబాద్ సిటీ పోలీస్ తరుఫున సీపీ ధన్యవాదాలు తెలిపారు. నగరంలో మరో నాలుగు వ్యాక్సినేషన్ కేంద్రాలు పోలీసు కుటుంబ సభ్యుల కొరకు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజు 500 నుంచి 700 వందల మందికి వ్యాక్సిన్ వేసే లక్ష్యం ఉందని, ప్రభుత్వం తరఫున వచ్చిన ఈ అవకాశాన్ని పోలీసు కుటుంబ సభ్యులు వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: chada venkat reddy: సీఎం కేసీఆర్​కు చాడ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.