హిజ్రాలు కూడా సమాజంలో భాగమేనని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని హిజ్రాలకు నిత్యావసర సరుకులు అందించారు.
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిజ్రాలను ఆదుకునేందుకే నిత్యావసర సరకులు పంపిణీ చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిజ్రాలు భౌతిక దూరం పాటిస్తూ కూర్చోవడాన్ని ఆయన అభినందించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే లాక్డౌన్ కొనసాగుతోందని.. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనే ఉండి సహకరించాలని కోరారు. ఇవీ చూడండి: సాదాసీదాగా తెజస వార్షికోత్సవం