హైదరాబాద్(hyderabad)లో ప్రజల సహకారంతో లాక్‌డౌన్(lock down) పటిష్ఠంగా అమలవుతోందని పోలీసు కమిషనర్(cp) అంజనీకుమార్ వెల్లడించారు. పోలీసులకు 99శాతం మంది సహకరిస్తున్నారని... కేవలం 1శాతం మంది మాత్రమే అనసవరంగా బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. పాతబస్తీలో పర్యటించిన సీపీ... మదీనా చెక్‌పోస్టు వద్ద లాక్‌డౌన్ అమలుతీరును పరిశీలించారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు. రోజూ 6వేల వాహనాలను సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో 180చెక్‌పోస్టుల వద్ద 24గంటలపాటు పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్నారని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి: Vaccination: రేపట్నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్