రాష్ట్రంలో కొవిడ్ టీకా రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. గాంధీ ఆస్పత్రిలో రెండో డోస్ డీఎంఈ రమేశ్ రెడ్డి తీసుకున్నారు. టిమ్స్ డైరెక్టర్ విమలా థామస్ కూడా రెండో డోస్ తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాల్లో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గత నెల 16న తొలిడోస్ టీకా తీసుకున్న వారికి నేడు రెండో డోస్ ఇస్తున్నారు.